పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహణ

పయనించే సుమారు 01-04-2026 (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలోని నాగులవంచ రైల్వే కాలనీలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎల్. నాగేంద్రమ్మ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాగేంద్రమ్మ మాట్లాడుతూ, గ్రామంలో పౌర హక్కులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కల్పించినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.సంక్షేమ అధికారి కొత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు ప్రతి ఒక్కరికి సమానంగా అందాలని అన్నారు. గ్రామంలో పాఠశాలలు, దేవాలయాలు, హోటళ్లలో ఎటువంటి తక్కువ-ఎక్కువ భావాలు లేదా వివక్ష ఉన్నా వెంటనే తెలియజేయాలని సూచించారు. ప్రజలందరూ పౌర హక్కులపై అవగాహన కలిగి ఉంటే సమాజం మరింత చైతన్యవంతంగా మారుతుందని తెలిపారు.అలాగే, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై సవివరంగా వివరించి,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బి. రమేష్, ఆర్‌ఐ ఎం. ఏకవీర, జి. భాస్కరరావు (క్లస్టర్ కోఆర్డినేటర్), వై. రాములు (హెడ్ కానిస్టేబుల్), పి. శ్రీనివాసరావు (విలేజ్ అసిస్టెంట్), పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.