ప్రజ్ఞాపూర్ లోని అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణ పనులను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించిన గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 1గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా ఈ సందర్బంగా వెంటనే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ మిగతా నిర్మాణ పనులను ప్రారంభించి ప్రజ్ఞాపూర్ బస్టాండ్ ను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ పనుల కోసం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేసి గజ్వేల్ నియోజకవర్గం లో అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణాలతో పాటు ఇతర నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లను కూడా 1 నెల రోజులలో పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు