బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా పుట్ట రామ్ రెడ్డి

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 01 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మంగళవారం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన ఎవిఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల పార్టీ కమిటీని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్య క్షులుగా పుట్ట రాంరెడ్డి, కార్యనిర్వాహ అధ్యక్షులుగా వెంకటయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మొక్తాల శేఖర్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షు లుగా కానుగుల జోగయ్య, గండికోట రాజు, రమేష్ గౌడ్, వెంకటయ్య, అధికార ప్రతినిధిగా జంగిలి నిరంజన్, ప్రచారకార్యదర్శి జంగిలి యాదగిరి, కార్యదర్శులు గా కొండల్, అంజయ్య, హనుమంతు నాయక్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార సంస్థ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్, మాజీ జడ్పీటీసీ విజిత రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్యం, బిఆర్ఎస్ పార్టీ మండల కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *