బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా బండారు కవితా రెడ్డి నియామకం: హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు

పయనించే సూర్యడు 01-04-2026 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​ నడిగూడెం మండలం బృందావనపురం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకురాలు బండారు కవితా రెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆమె నియామకం పట్ల పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ​సేవలకు దక్కిన గుర్తింపు
​పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కవితా రెడ్డి సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం ఆమెకు ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. నిబద్ధత కలిగిన నాయకత్వానికి ఈ పదవి దక్కినట్లు పార్టీ నాయకులు కొనియాడారు.​ బండారు కవితా రెడ్డి ​ఈ సందర్భంగా బండారు కవితా రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ ఉన్నత నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత ఉత్సాహంతో పని చేస్తాను. ​కోదాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుండి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతాను. ​కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులకు లబ్ధి చేకూరేలా కృషి చేస్తాను​ ​కవితా రెడ్డి నియామకం పట్ల బిజెపి నడిగూడెం మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి, ప్రజా సేవలో అగ్రగామిగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *