బిల్డింగ్ కూల్చి వేస్తారనే భయంతోనే సౌదీ రవూఫ్ అసత్య ప్రచారం.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. తప్పు చేసానని, బిల్డింగ్ కూల్చేస్తారనే భయంతోనే సౌదీ రవూఫ్ ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని బిజెపి నాయకుడు మధుసూదన శర్మ తెలిపారు.సౌదీ రవూఫ్ బిల్డింగ్ కుడా అనుమతులకు వ్యతిరేకంగా కడుతున్నారనే విషయాన్ని మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే పార్థసారథి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని, ఆదోని ప్రజలు ఎవరు కట్టడాల నిర్మాణం విషయంలో తప్పుచేసిన మీరు తొందరపడి నోటీసులు ఇవ్వకండి నేను పిలిచి తప్పులుంటే సరిచేసుకోమని చెబుతానని అప్పటికి వినకుండా అక్రమంగా కట్టడాలు కొనసాగిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుందామని అధికారులకు తెలిపారని, అందుకే కూటమిలో నాయకుడు కాబట్టి సౌదీరవూఫ్ కి కూడా ఎమ్మెల్యే పార్థసారథి చెప్పడం జరిగిందని, అది జీర్ణించుకోలేక సౌదీరవూఫ్ ఎమ్మెల్యే పార్థసారథి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మధుసూదన శర్మ తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథి రోజురోజుకు ఆదోని ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటు తనదైన శైలిలో దూసుకుపోవడాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారని, ఆదోని ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారని సమయం వచ్చినప్పుడు సౌదీరవూఫ్ లాంటి నాయకులకు బుద్ధి చెబుతారని మధుసూదన శర్మ వివరించారు.