మంత్రాలయం అభివృద్ధికి ₹6.60 కోట్లు కేటాయింపు

★ జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి టీజీ భరత్ సమక్షంలో, కలెక్టర్ ఎ.శిరి, జాయింట్ కలెక్టర్ పాల్గొనగా ★ మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్.రాకేష్ రెడ్డి హాజరయ్యారు

పయనించే సూర్యుడు న్యూస్ 01-04-2026 రిపోర్టర్ అభి కర్నూలు జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని నిర్వహించిన జిల్లా స్థాయి బడ్జెట్ సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గానికి రూ.6.60 కోట్ల నిధులు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి టీజీ భరత్ సమక్షంలో, కలెక్టర్ ఎ.శిరి, జాయింట్ కలెక్టర్ పాల్గొనగా ఈ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎమ్మెల్యేలు, మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్.రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్.రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలను పాయింట్ టు పాయింట్‌గా జిల్లా ఇన్చార్జి మంత్రికి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. బడ్జెట్ కేటాయింపులలో భాగంగా మంత్రాలయంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి రూ.5 కోట్లు, మైనార్టీ సాధికార కేంద్రానికి రూ.80 లక్షలు, కోసిగిలో వాల్మీకి భవన్ నిర్మాణానికి రూ.80 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధుల కేటాయింపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎన్.రాఘవేంద్ర రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా అధికారులు, బీజేపీ–జనసేన జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించారు.