మంత్రిని కలిసిన నరవ దంపతులు, సమస్యలపై చర్చ

పయనించే సూర్యుడు న్యూస్ 01-04-2026 రిపోర్టర్ అభి కర్నూలు నగరంలోని ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్‌లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును నరవ రమాకాంత్ రెడ్డి, నరవ శశిరేఖ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్‌లో ఉన్న పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు మంత్రితో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక స్థాయిలో ఎదురవుతున్న నీటిపారుదల సమస్యలు, మౌలిక వసతుల అభివృద్ధి, పలు ప్రజా అవసరాల అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. వారి వినతులను శ్రద్ధగా విన్న మంత్రి నిమ్మల రామానాయుడు, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.