పయనించే సూర్యుడు న్యూస్ చౌటుప్పల్ ఏప్రిల్ 01. చిన్నకొండూర్ గ్రామానికి చెందిన బొంగు అంజన్ కుమార్ తండ్రి నర్సింహ గారికి గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా బాధ పడుతున్నాడు ఈ విషయం స్థానిక చిన్నకొండూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్టి విషయాన్ని మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి కి తెలియ చేశారు.దేవుడి రూపంలో ఉన్న మా స్థానిక శాసన సభ్యులు పేదల పెన్నిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే స్పందించి,ఇంకా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి కి పంపించి డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ అవసరం పడుతుంది అని చెప్పారు వెంటనే ఆపరేషన్ కు 2.50.000/- (రెండు లక్ష ల యాబైవెల రూపాయలు) పెట్టి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ విజయవంతం చేసి మాలాంటి ఎన్నో పేద ప్రజల నిండు ప్రాణాలు కాపడినదుకు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ లక్మి మేడం దంపతుల కు ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.మా చిన్నకొండూర్ గ్రామ ప్రజలు ఎల్లపుడు మీకు రుణపడి ఉంటాము అని గ్రామస్తులు తెలియజేశారు. ఇట్టి విషయాన్ని చిన్న కొండూరు గ్రామ మాజీ సర్పంచ్ బక్క స్వప్న శ్రీనాథ్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారితో పాటు సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు