మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎం ఆర్ ఓ – పి హెచ్ సి ముందు ధర్నా

పయనించే సూర్యుడు ఏప్రిల్ 01 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రం ఆశలకు రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ (తెలంగాణ గ్రామీణ ఆశా వర్కర్స్ యూనియన్ బి ఆర్ టి యు అనుబంధ) సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్ర బస్టాండ్ నుండి ఎమ్మార్వో - పి హెచ్ సి సెంటర్ ల వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మాట్లాడుతూ గత 19 రోజుల నుండి తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంతో ఉక్కు పాదం మోపుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 18 వేల రూపాయల వేతనం ప్రతినెల మొదటి తారీకున వేతనాలు ఇస్తామని చెప్పిన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నారని సమస్యలు పరిష్కరించకుండా మహిళలను చూడకుండా నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదని రెండు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉంటే వారి కుటుంబాలు ఎలా పుటగలుస్తాయని ప్రశ్నించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే బి ఆర్ టి యు ఆధ్వర్యంలో మరింత ఆందోళన పోరాటాల ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆశాల పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్ మనుబోతుల గడ్డ సర్పంచ్ ఆబోతు శ్రీలత-అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత టిఆర్ఎస్ పార్టీ నాయకులు జాటోత్ సదర్ లాల్ మౌలానా బి.ఆర్.టి.యు మండల అధ్యక్షుడు ఎస్.కె అల్లావుద్దీన్ ఆశల యూనియన్ మండల అధ్యక్షురాలు సంధ్య ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు