
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 01. చండూరు మున్సిపల్ పట్టాన జేంద్రంలో నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్ల ప్రకారంగా మంగళవారం రోజున చండూరు టౌన్ లోని స్పెషల్ డ్రైవ్ లో భాగంగా (09) మంది మైనర్లు వాహనాలు నడుపుతుండగా వారిని పట్టుబడి చేసి వారి పైన కేసు నమోదు చేసి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసినారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. వాహనాన్ని సీజ్ చేసి, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తారు. పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి, జరిమానాలు విధించడంతో పాటు, 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా అనర్హత వేటు వేసే అవకాశం ఉంది వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇవ్వొద్దని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రమాదం జరిగితే వాహన యజమాని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడపడం, తప్పుడు నంబర్లు ఏర్పాటు చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా శబ్ద కాలుష్యాన్ని సృష్టించే విధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్ లను కలిగి ఉన్న వాహనదారుల పై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నిబంధనలకు లోబడి నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయాలి, లేకపోతే వాహనదారుల చీటింగ్ కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. ఎవరైనా మైనర్లకు వాహనాలు ఇస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి అని , అలాగే ప్రతి ఒక్కరు హెల్మెట్ దరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని కె. అది రెడ్డి, సి.ఐ, చండూర్ తెలిపారు, ఈ కార్యక్రమంలో యస్ ఐ చండూరు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.