యర్రవరం పాఠశాలలో స్టెమ్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు న్యూస్, 01-04-2026 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): మండలంలోని యర్రవరం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఆధునిక సదుపాయాలతో నిర్మించబడిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణిత శాస్త్ర ప్రయోగశాలను మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యాప్రభ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతూ, అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా కృషితో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజాప్రతినిధులుగా విలువైన సేవలు అందిస్తున్న ప్రజా ప్రతినిధులకు సన్మాన సత్కార్యములునిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి, సర్పంచ్ బీశెట్టి అప్పలరాజు, కూటమి శ్రేణులు మేడిశెట్టి బాబీ, బస ప్రసాద్, మైరాల కనకారావు,గంగిరెడ్ల మణికంఠ, సూరిబాబు, తోట వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు ఎన్.కన్నబాబు,కమిటీ చైర్మన్ పంపిన వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్, ఉపాధ్యాయులు గుమ్మడి నాగరాజు, గరికి వీర వెంకట సత్యనారాయణ,శామ్యూల్ సన్, కోట వీర వెంకటేశ్వర్, కే.రమణ, దట్టెంజ్యోతి, జి.స్వరూపారాణి, గుమ్మడి సత్యవేణి, కుంజం శైలజ, తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *