పయనించే సూర్యుడు ఏప్రిల్ 01 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కేంద్రం అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సమిష్టిగా నిర్వహించిన ఉగాది పురస్కారాలు 2026 కు సంబంధించి రాణి రుద్రమ దేవి అవార్డును మనుబోతుల గడ్డ గ్రామపంచాయతీ సర్పంచ్ ఆబోతు శ్రీలత-అశోక్ కు హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో శాలువాతో సత్కరించి రాణి రుద్రమ దేవి అవార్డును సర్పంచ్ కు యాజమాన్యం అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత అశోక్ మాట్లాడుతూ అనతి కాలంలోనే నన్ను గుర్తించి ఈ గొప్ప అవార్డును అందించడం గర్వంగా ఉందని మీరు అందించిన స్ఫూర్తితో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అందరి ఐక్యత సహకారంతో ముందుకు వెళ్లి ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు