వట్టెంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సంఘం నూతన కమిటీ ఎన్నిక

కార్యక్రమంలో గ్రామ కమిటీల వ్యవస్థాపకులు దేవరకొండ రామచందర్ మొల్గర మహేందర్ లేట్ల వెంకట్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ వట్టెం గ్రామంలో దళిత వర్గాల ఐక్యతను చాటుతూ నూతనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సంఘం కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. ఆదివారం గ్రామ వ్యవస్థాపకులు దేవరకొండ రామచందర్, ముల్లర మహేందర్, లేట్ల వెంకట్ మరియు గుమ్ముకొండ రాములు గార్ల పర్యవేక్షణలో స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ భవనం వద్ద ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. గ్రామంలోని సుమారు 30 మంది దళిత సభ్యులు ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఈ విధంగా ప్రకటించారు: నిర్వాహక కమిటీ వివరాలు: గౌరవ అధ్యక్షులు: డాక్టర్ బి. తిరుపతయ్య అధ్యక్షులు: ఆళ్ల నరేష్ ప్రధాన కార్యదర్శి: దస్తగిరి ఉపాధ్యక్షులు: కుమార్, ఆంజనేయులు కోశాధికారి: బొడ్డు యాదగిరి సలహాదారులు: దేవనారాయణ శ్రీనివాస్, బొడ్డు ఆంజనేయులు, మహేష్, భగవంతు, రామకృష్ణ ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ఆళ్ల నరేష్ మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధిలో దళితుల పాత్రను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ గ్రామ పురోగతికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *