
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబుఎన్టీఆర్ జిల్లా… జగ్గయ్యపేట.. నియోజకవర్గం. 01-04-2026 పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు హుండీ లెక్కింపు జరిగినది, 48 రోజులకు గాను శ్రీ తిరుపతమ్మ అమ్మవారి సాధారణ ఖాతా ద్వారా 76,38,287/- రాగా మిశ్రమ బంగారం:-20 గ్రాములు, మిశ్రమ వెండి:-375 గ్రాములు వచ్చింది అని, విదేశీ కరెన్సీ యిఎస్ఏ:-34, సౌదీ రియల్స్:-5, మలేషియా రింగ్గిట్స్:-8,ఆస్ట్రేలియా డాలర్స్:-175 వచినవి అని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ప్రకటన చేశారు, ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి జయ ప్రకాష్ బాబు, కార్యనిర్వాహణ అధికారి బి.వి సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ మరియు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మహేశ్వర్ రెడ్డి, దేవస్థాన సిబ్బంది మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
