శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అలరించిన చిన్నారుల నృత్యాలు..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) . కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో దివ్య కళ్యాణం మహోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గ్రామ జనసేన గౌరవాధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో శ్రీ జగన్మాత నాట్యాలయ సౌజన్యంతో చిన్నారులు వేసిన నృత్యోలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు బత్తుల దొరబాబు మాట్లాడుతూ చిన్నారులు మీద వేసదారులతో వేసిన నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయని భక్తులను అలరించేయని వీరికి తోడ్పడుతున్న తల్లిదండ్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు అలాగే మా గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి చిన్నారికి జ్ఞాపకాన్ని అందజేసి గౌరవించడం జరిగిందని తెలిపారు. అలాగే తప్పిది ఇచ్చిన నాట్య చారి పల్లా సత్యవతిని అభినందించారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది చిన్నారులు వారి తల్లిదండ్రులు మరియు మాదారపు తాతాజీ యూత్ సభ్యులు, గ్రామస్తులు జనసేన నాయకులు పాల్గొన్నారు.