స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ” 2025- 26 విద్యా సంవత్సరమునకు అకాడమిక్ ఆడిట్ “

పయనించే సూర్యుడు అనకాపల్లి జిల్లా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ విద్యా సంవత్సరం అకాడమిక్ ఆడిట్ కొరకు డాక్టర్ జి విజయ ప్రతాప్ వి ఎస్ కే గవర్నమెంట్ డిగ్రీ కళాశాల,ఎం కిషోర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎలమంచిలి వారు 30.03.2026 రోజున కళాశాలకు విచ్చేసి ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ ఆడిట్ కొరకు కలిసి మాట్లాడారుఐ క్య్ ఏ సి సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి ఆధ్వర్యంలో తదనంతరం డాక్టర్ విజయ ప్రతాప్, బోటనీ, జువాలజీ ,కెమిస్ట్రీ, ఫిజిక్స్, పీజీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్, కళాశాల గ్రంధాలయం సందర్శించి నాక్ మోడల్ ఆడిట్ రికార్డులను అన్నింటిని లోతుగా పరిశీలించారు. ఎం కిషోర్ గారు హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్స్ కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈ ఎల్ ఎల్ కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ హబ్ ల్యాబ్ యొక్క రికార్డులు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్స్,ఎన్ సి సి సి, మౌలిక వసతులు వివిధ రకాలైనటువంటి అంశాల పైన తనిఖీలు నిర్వహించారు.విద్యార్థులకు కలిగినటువంటి వసతులు, త్రాగునీరు, మరియు టాయిలెట్ విషయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల సమావేశము నందు కళాశాల అభివృద్ధి కొరకు తీసుకోవలసిన పలు సూచనలు చేశారు. ఈ రోజున కార్యక్రమాలను ఐ క్యూ ఏ సి సమన్వయకర్త డాక్టర్ నారాయణ మూర్తి, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ రత్నభారతి, డి.మాల్యాద్రి, బి.పిచ్చమ్మ, సీనియర్ అధ్యాపకులు హెచ్ సుదీర్, వి.అప్పలనాయుడు, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సంధ్య డాక్టర్ సూర్యవతి, డాక్టర్ వాసు దేవరాజు, డాక్టర్ వెంకటేష్,సరస్వతీ, రామలక్ష్మి, కోమల, కామర్స్ శ్రీనివాసరావు, పాల్గొన్నారు