అంగన్వాడి కేంద్రంలో పోషకాహారం పై అవగాహన తో పాటుగా చిన్నారుల తల్లులకు వంటల ప్రోగ్రాం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 02 రిపోర్టర్ కామని ప్రమోద్ వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండల కేంద్రం చిన్నారులకు అందించే పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మండల తహశీల్దార్ రమేష్ స్థానిక సర్పంచ్ దాసరి రమేష్ ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు వైద్య సిబ్బంది,ఐకెపి సిబ్బంది అంగన్వాడి టీచర్లు రుచికరమైన వంటలు చేసిన తల్లులకు బహుమతులు ప్రధానం చేసిన ఎం ఆర్ వో రమేష్ సర్పంచ్ దాసరి రమేష్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పోషకాహారంతో పాటుగా ప్రీ ప్రైమరీ విద్యా కార్యక్రమాల్లో టీచర్స్ ఎక్కువ శ్రద్ధ చూపించి లబ్ధిదారులకు అందుబాటులో ఉండాలని అన్నారు. అలాగే అంగన్వాడి కేంద్రాల ద్వారా చేపడుతున్న తప్పకుండా ప్రజలకు చాలా ఉపయోగపడతాయని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను సుఖప్రసవాల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించే విధంగా వారికి అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ రమ ఉప సర్పంచ్ ఉప్పు రాజు వార్డు సభ్యులు పల్నాటి నిర్మల కందుల రమాదేవి గుండ్లపెల్లి విజయ్ వేములపల్లి వెంకటప్రసాద్ రావు చలికంటి మల్లికార్జున్ తోటకూరీ సంధ్య ఎస్ హెచ్ ఓ లీల ఏఎన్ఎం సునీత సీసీ కరుణ తదితరులు పాల్గొన్నారు