అనుమానంతో భార్యను చంపిన భర్త అరెస్టు

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 2, అనంతపురం జిల్లా, గుత్తి మండలం రిపోర్టర్ బి నిజాముద్దీన్ వార్తా విశ్లేషణ: గుత్తి మండలం పూలకుంట గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఎస్ ఆర్ కె క్రషర్ మిషన్ ఉన్నటువంటి ప్రదేశంలో గుంతకల్ మండలం మైనాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ అనే ఆమెను తన భర్త అయిన శివలింగయ్య తన భార్య మీద అనుమానంతో గొడవపడేవాడని, ఆక్రమంలో భార్య లక్ష్మి ప్రవర్ధన పైన అనుమానం పెంచుకొన్న శివలింగయ్య తన భార్య ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని గత నెల 31వ తేదీ బళ్లారిలో జరిగే దేవరకు వెళ్ళడానికి ఉదయం సుమారు ఏడు గంటలకు గంటలకు కదిరిపల్లి గ్రామం నుండి భార్యను తన మోటార్ సైకిల్ పైన ఎక్కించుకొని దేవరకు పోకుండా గుత్తి మండలంలోని పూలకుంట గ్రామం దగ్గర గల ఎస్ కే ఆర్ కంకర ఫ్యాక్టరీ క్వారీ ప్రాంతంలోకి ఒంటరిగా తీసుకుపోయి అక్కడ గొడవపెట్టుకొని, ఉదయం సుమారు తొమ్మిదినర గంటల సమయంలో రాళ్ళతో తలపైన కొట్టి చంపడమైనది. జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదేశాల మేరకు గుంతకల్లు డి.ఎస్.పి ఏ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో, గుత్తి సీఐ , ఎం.రామారావు మరియు సిబ్బంది కలిసి ఈరోజు ఉదయం 11:45 గంటలకు గుత్తి టౌన్, లచ్చానపల్లి రోడ్డులో గల రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి మోటార్ సైకిల్ ను రక్తపు మరకలు గల బట్టలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు లో పాల్గొన్న అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.