ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరూ సంతోషిస్తున్న క్షణాలివి..

పయనించే సూర్యుడు ఏప్రియల్ 2, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్ సభ ఆమోదం పొందటంతో రాష్ట్ర ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు. వారంతా గర్వించే క్షణాలివి. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుంది. లోక్ సభలో ఈ బిల్లుకు మద్దతు తెలియచేసిన పక్షాలకు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అమరావతికి చట్టబద్ధత అభించడాన్ని జీర్ణించుకోలేక విషం చిమ్ముతున్నవారికి రాబోయే రోజుల్లో ప్రజలు మరింత బలమైన పాఠం నేర్పిస్తారు. రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో అమరావతి ప్రజా రాజధానికి, భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందనే విశ్వాసం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *