పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఈరోజు ఆదోని మండలం మండగిరి ప్రాంతంలోని తిరుమల నగర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి కొనసాగుతుందని తెలిపారు. పేదల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.పేదల సేవే పరమోద్ధేశం — టీడీపీ ప్రభుత్వ ధ్యేయం!" అని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మురళి, గుడిసె శ్రీరాములు, చంద్రన్న, వడ్డేమాన్ గోపాల్, మాజీ కౌన్సిలర్ మారుతి, రాజశేఖర్, దేవేంద్ర, భరత్, వీరేష్, భాస్కర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..