
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో 34 వార్డులో, కాజీపుర ఏరియాలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్‌లను అందజేశారు.ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ* :-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని పనిచేస్తోందన్నారు. వృద్ధులు,వికలాంగులు, వితంతవులుకు మరియు అర్హులైన ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం అందించాలనే సంకల్పంతో ఎన్టీఆర్ భరోసా వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రంగస్వామి నాయుడు, రంగన్న, ఇక్బాల్, డిష్ బాషా, రసూల్, చాంద్ బాషా, హుసేని, అరీఫ్, వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.