ఎమ్మెల్యే కలసిన వెల్దండ నాయకులు

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 2 2026, నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం వెల్దండ గ్రామ పంచాయితీ అభివృద్ధి పై బుధవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే స్వగృహంలో వెల్దండ నాయకులు కలిశారు. వెల్దండ సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచి యెన్నం భూపతి రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారిని మర్యాదపూర్వంగా కలిశారు. అనంతరం వారు గ్రామానికి సంబందించిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే తో చర్చించామన్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పసునోజు వాణి పురుషోత్తమాచారి, ముదికొండ కవిత రమేష్, గుద్దటి కిష్టయ్య, మసిగుండ్ల వెంకటేష్, మారేపల్లి మంజులశ్రీనివాస్, నాయకులు కొయ్యల పుల్లయ్య, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ గౌడ్, బొక్కల శ్రీనివాస్, పందెం రమేష్ రెడ్డి, రేవల్లి దర్గయ్య, రేవల్లి రాజు, కూన పాండు, జంగిలి ఆనంద్ రాజ్ తదితరులు ఉన్నారు.