ఏప్రిల్ ఒకటి నుంచి విద్యార్థులకు హాఫ్ డే కాలేజెస్

పయనించే సూర్యుడు చోడవరం రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ 2.4.2026 రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు అందరికీ కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించమని రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్య శాఖ సంచాలకులు, పి రంజిత్ భాషా గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు ఈ సందర్భంగా చోడవరం మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కళాశాలకు హాజరై తరగతులను సద్వినియోగం చేసుకోగలరని ప్రిన్సిపాల్ కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని రాయితీలను విద్యార్థులకు తరగతులు నిర్వహించి సమయంలో వర్తిస్తాయని ప్రిన్సిపాల్ తెలిపారు అదే విధంగా ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఆన్ టీ సి అడ్మిషన్లు కూడా యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు హాల్ టికెట్ ఆధారంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకొనుటకు దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేవరకు కళాశాలకు యధావిధిగా హాజరు కావచ్చని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెలిపారు. మండలంలో మారుమూల ప్రాంతం కోణం రిజర్వాయర్ ఎగువ భాగంలో ఉండే శివారు గ్రామాలలో ఉండే విద్యార్థులు అదేవిధంగా చీడికాడ, పడ్డాది, మాడుగుల సరిహద్దు గ్రామాల్లో చదువుకు దూరమైనటువంటి విద్యార్థులందరికీ కూడా వసతి గృహాలలో వసతి గృహ సంక్షేమ అధికారులు హాస్టల్ వసతులు కూడా కల్పిస్తారని ఈ సందర్భంగా వివరించారు. చోడవరం లో అంకు పాలెంలో గిరిజన విద్యార్థులకు సంక్షేమ వసతి గృహం కలదు. అదేవిదంగా గిరిజన బాలురకు గోవాడ గ్రామంలో సంక్షేమ వసతి గృహం కలదు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు చోడవరం గ్రామ ప్రారంభం లో మెయిన్ రోడ్ నందు వసతి గృహం కలదు. అదేవిదంగా గా బాలికలకు చోడవరం గ్రామం లో వెనుకబడిన బాలికల వసతి గృహం కలదు. షెడ్యూల్డ్ తరగతుల బాలికల విద్యార్థులకు సాంఘిక సంక్షేమ వసతి గృహం చిడికాడ రోడ్ లో విద్యుత్ కార్యాలయం దగ్గర కలదు. షెడ్యూల్డ్ తరగతుల బాలురకు సాలాపురమ్మ ఆలయం దగ్గర సిటిజెన్ కాలనీ లో వసతి గృహం కలదు. గిరిజన విద్యార్థినిలకు వసతి గృహం నిమిత్తం శ్రీమతి కూడా శైలజ 7780455259 ను సంప్రదించగలరు. గిరిజన బాలురకు వసతి గృహం నిమిత్తం కరీముద్దిన్ 9959615175 నెంబర్ సంప్రదించగలరు. వెనుకబడిన బాలురు వసతి నిమిత్తం ఈశ్వరరావు 8074733281 సంప్రదించగలరు. వెనుకబడిన తరగతుల కళాశాల బాలికలు వసతి నిమిత్తం సంక్షేమ అధికారిణి శ్రీమతి దేవి 9502357609 ను సంప్రదించగలరు. షెడ్యూల్డ్ తరగతుల కళాశాల బాలురు సంక్షేమ అధికారి ఈశ్వరరావు 9705664059 సెల్ నెంబర్ కు , కళాశాల బాలికలు వసతి నిమిత్తం సంక్షేమ అధికారిణి మతి వరలక్ష్మి 8008735861 లను సంప్రదించగలరు. ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ ల నిమిత్తం వై. బి. వి. ఎస్. చంద్ర శేఖర్ 9490811813 నకు సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *