ఏప్రిల్ 02 నుంచి గ్రామ సభలు : ఎంపీడీఓ యాదగిరి .

★జూన్​ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త ప్రభుత్వ పథకాలను ప్రజలకు  వివరించాలి . ★ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ సభలో చదివి వినిపించాలి. ★జూన్ 2 నుంచి ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా పథకం . ★ సభల అజెండాను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చ . ★గ్రామ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎంపీడీఓ యాదగిరి .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 02. కస్తాల గ్రామంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని,  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకే రకంగా గ్రామ సభల నిర్వహణ జరుగనున్నది అని చండూరు మండల ఎంపీడీఓ యాదగిరి తెలిపారు. బుధవారం కస్తాల గ్రామంలోని రైతు వేదికను సందర్శించి గ్రామ సభ ఏర్పాట్లపై గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. జూన్​ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త ప్రభుత్వ పథకాలను ప్రజలకు  వివరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ పంచాయతీ పరిధిలో చదివి వినిపించాలని ఎంపిడిఓ యాదగిరి తెలిపారు. ముందుగా సీఎం రేవంత్​ రెడ్డి పంపిన సందేశం వినిపించి గ్రామ సభ స్టార్ట్​ చేయాలని చెప్పారు. ‘జూన్ 2 నుంచి ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున అందించే జీవిత బీమా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారంలో భాగంగా మూడు రోజులపాటు గ్లాస్ పాలు, మూడు రోజులపాటు రాగి జావా అందించడం, ఇంటర్ విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా వివరించాలి’ అని ఎంపిడిఓ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే గ్రామసభల్లో ఇప్పటి వరకు ప్రభుత్వ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై చర్చ జరగాలని ఎంపీడీఓ యాదగిరి సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాల ఉద్దేశాలను వివరిస్తూ ముఖ్యమైన తీర్మానాలు చేయాలన్నారు. 
పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారాలు కనుగొనడం, ప్రభుత్వ పథకాల అమలును సమీక్షించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, లబ్ధిదారులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని, ప్రతి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సభల్లో ,వేదికల్లో , తాగునీరు, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సభల అజెండాను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చ జరిగేలా చూడాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌, మహిళా శక్తి వంటి పథకాలపై ప్రత్యేకంగా చర్చించాలని పేర్కొన్నారు. గ్రామసభల్లో ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేసి ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని ఎంపీడీఓ స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్ గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కలిమికొండ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పంగ రామకృష్ణ , ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ నర్సింహా , దోనాల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు అంజయ్య, గురజాల స్వామి , ధోనాల వెంకట్ రెడ్డి , సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి జోగు రమేష్ ,సిపిఐ సీనియర్ నాయకులు కట్ట యాదయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు ,రైతులు , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.