కమ్యూనిటీ ఫారెస్ట్ పై అవగాహన సమావేశం.

ముఖ్య అతిథిలుగా గ్రామ సర్పంచ్,ఎంపిటిసి,ఫారెస్ట్ గార్డ్,పంచాయితీ సెక్రటరీ,పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు.

పయనించే సూర్యడు ఏప్రిల్. 02.2026 పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం, దేవీ పట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం నందు జరిగిన గ్రామ సభకు గ్రామపంచాయతీ సర్పంచ్ రమాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫారెస్ట్ గార్డ్ నందిని మాట్లాడుతూ… పోతవరం గ్రామంలో ఉన్న 40 ఎకరాలు కమ్యూనిటీ ఫారెస్ట్ లో వెదురు పెంపకం మరియు నిర్వహణపై అవగాహన కల్పించడం జరిగింది. మరియు 10 మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందులో 5 గురు మహిళలు 5 గురు పురుషులను కమిటీలో నియమించటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి, ఎంపిటిసి సభ్యులు తుర్రం జగదీష్ దొర, పంచాయితీ సెక్రటరీ మణికంఠ, ఫారెస్ట్ గార్డ్ నందిని, పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్, సొసైటీ మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర మరియు గ్రామ పెద్దలు మహిళలు యువతీ యువకులు మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *