
పయనించే సూర్యుడు : మార్చి 2/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయ బాబు ఈసందర్భంగా మాట్లాడుతూ కల్లూరు మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు అందడం లేదని వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మాది ప్రజా ప్రభుత్వం, ఈరాష్ట్రంలో ఏఒక్కరికి కష్టం కలిగినా అది నాకష్టం గా ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి కి మున్సిపల్ కార్మికులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మంత్రులు, శాసనసభ్యులు ప్రతినెలా జీతాలు తీసుకోవడం లేదా అని ప్రశ్నించారు. పాశుధ్య కార్మికులు అంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు.ఎండనక,వాననక పని చేసినా కూడా వారి మీద దయలేకపోడం దారుణమని అన్నారు.వంటనే వారి వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తాము ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం 26 వేల 750 రూపాయలు ఇవ్వాలని. కార్మికుల రక్షణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో భీమా సౌకర్యం కల్పించాలని, దీని కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, కోబ్బరినూనె, సబ్బులు, బూట్లు,యూనిఫాం, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించాలని, అనివార్యకారణాలవల్ల కార్మికులు చనిపోతే 20లక్షల రూపాయల భీమా ఇవ్వాలని, అంత్యక్రియలకు 20వేలరూపాయలుఇవ్వాలి. కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని, కార్మికులకు వాంతపు సెలవులు ఇవ్వాలని. పండుగలు జాతీయ శలవు దినాలలో పనిచేసే కార్మికులకు అదనపువేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్ కు, మేనేజర్ నందిశెట్టి నాగేశ్వరరావు కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ 12 వార్డు కౌన్సిలరు షేక్ ఇస్మాయిల్, బీఆర్ ఎస్ నాయకులు దార్ల నరసింహారావు, సీఐటీయు నాయకులు మీనుగు క్రిష్ణ, వేల్పుల రామారావు, రెడ్డిచర్ల సునిల్, మున్సిపల్ కార్మికులు జయమ్మ, బొల్లం మల్లికార్జున్, సుధాకర్, బొడ్డు సుజాత తదితరులు పాల్గొన్నారు.