కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలివ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షుడు తన్నీరు క్రిష్ణార్జునరావు

పయనించే సూర్యుడు : మార్చి 2/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ తీసుకు వచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి అని కల్లూరు లో సీఐటీయు,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసనకార్య క్రమంలో మాట్లాడుతూ ఎంతోమంది కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రం లో వున్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకు రావడం దారుణమని అన్నారు.ఎనిమిది గంటల పనిదినాలు రద్దు చేసి కార్మికులకు పన్నెండు గంటల పని చేయించేందుకు పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికులను యజమానులవద్ద తమ హక్కులకోసం బిక్షం ఎత్తుకొనెలా కుట్రలు చేస్తున్నారని అన్నారు.కార్మికులు,రైతులు,వ్యవసాయ కార్మికులు సంఘటితంగా పోరాటాలు చేయాలని తమహక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో భవన నిర్మాణ రంగం కార్మికులు ,మోర్తాల పిచ్చి రెడ్డి,షేక్ మహబూబ్,ఉప్పు నరసింహారావు,జానీ,ఖమ్మంపాటి బాలస్వామి,వేల్పుల రవి ఏసుబాబు,రాము తదితరులు పాల్గొన్నారు.