పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 02 రిపోర్టర్ అభి : కౌతాళం గ్రామపంచాయతీ పరిధిలోని బండిమెట్ట, కమేళా, దినసరి మార్కెట్‌కు సంబంధించిన వేలం పాటలు వాయిదా పడినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం నిర్వహించాల్సిన ఈ వేలం పాటలను అనివార్య పరిపాలనా కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని సర్పంచ్ మరియు గ్రామపంచాయతీ అధికారులు తెలిపారు. ఈ వేలం పాటలు ఆదోని డివిజన్ పంచాయతీ అధికారి, జిల్లా ఎంపీడీవో ఆధ్వర్యంలో, పీఎస్ యోగేశ్వర్ రెడ్డి సమక్షంలో నిర్వహించాల్సి ఉండగా, కొన్ని పరిపాలనా సమస్యల కారణంగా నిర్ణయించిన తేదీన నిర్వహించడం సాధ్యపడలేదని వివరించారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేస్తూ, ఎవరూ ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. వేలం పాటల ద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం సమకూరే అవకాశం ఉన్నందున కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించి, పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.