గూడెం క్షేత్రంలో వైభవంగా గిరి ప్రదక్షిణ

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2: దండేపల్లి రిపోర్టర్ మందల మల్లేష్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని గూడెం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ బుధవారం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గోదావరి తీరంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక అర్చకులు పెరంబుదూరి హరీష్ ఆధ్వర్యంలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గోదావరి తీరంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి భక్తులు కాలినడకన యాత్రగా బయలుదేరారు. స్వామివారి నామస్మరణతో గూడెం గుట్ట పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బత్తుల చందు, చుంచు సత్తన్న, కర్నాల శ్రీకాంత్, గొల్ల మల్లేష్, కనగంటి కుమార్, కర్నాల అంజన్న, అక్కల సతీష్, వేముల అశోక్, అల్లాం లింగన్న, బత్తుల అజయ్, బత్తుల రక్షిత్, చుంచు సంతోష్, అల్లం మనీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *