పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన పూజారి గవ్వమఠం విజయ శాస్త్రి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు భజనలు, కీర్తనలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పడిపూజోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గురుస్వాములు దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. జయంతిని పురస్కరించుకొని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సాధారణ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అలాగే రోగి సహాయకులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి ప్రారంభించి, భక్తి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, భక్తులు మరియు సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు