ఘనంగా వార్డ్ మెంబర్లకు సన్మానం.

ముఖ్య అతిథిలుగా ఎంపీడీవో సాల్మన్ రాజ్,గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఉమా మహేశ్వరావు,ఎంపిటిసి తుర్రం జగదీష్ దొర.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 02.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం,దేవీ పట్నం మండలం, శరభ వరం గ్రామపంచాయతీ పరిధిలోని సచివాలయం నందు జరిగిన వార్డ్ మెంబర్ల సన్మాన సభకు గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి, కొమరం లక్ష్మీ దేవీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీవో సాల్మన్ రాజ్ మాట్లాడుతూ… వార్డ్ మెంబర్లగా ఎన్నికైన నాటి నుండి నేటికి ఐదు సంవత్సరాల పూర్తి కావస్తున్న,మీరు గ్రామాల అభివృద్ధికి అందించిన సేవలు అమోఘంగా అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఎంపిటిసి తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ… వార్డ్ మెంబర్లగా ఎన్నికైన నాటి నుండి అభివృద్ధికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. స్పెషల్ ఆఫీసర్ ఉమా మహేశ్వరావు మాట్లాడుతూ… వార్డ్ మెంబర్ల అందించిన ఉత్తమ సేవాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వార్డ్ మెంబర్ల అందరికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన అధికార్ల సమక్షంలో ఘనంగా శాలువాలుతో సన్మానం చేశారు.స్పెషల్ ఆఫీసర్ ఉమా మహేశ్వరావుకి పుష్పగుచ్చం ఇచ్చి పంచాయితీ సెక్రటరీలు,ఎంపిటిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి, కొమరం లక్ష్మీ దేవీ,ఎంపిటిసి సభ్యులు తుర్రం జగదీష్ దొర, పంచాయితీ సెక్రటరీలు మణికంఠ, రాంబాబు, పెసా గ్రామసభ ఉపాధ్యక్షులు తెల్లం శేఖర్, వార్డ్ మెంబర్ తుర్రం రామన్న దొర, తుర్రం పోశమ్మ,కొమరం కృష్ణ వేణీ, పండా రామలక్ష్మి,కలుం వెంకన్న దొర, మడకం శిరీష, నారా చక్రమ్మ, కొమరం కుమార్ స్వామి, ఎంపీడీవో ఏవో వెంకటేశ్వర్లు, విద్యా సాగర్ మరియు గ్రామ పెద్దలు మహిళలు యువతీ యువకులు మొదలైన వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *