చోడవరం పంచాయతీలో ఇంటి పన్ను సొమ్ము 16 లక్షలు స్వాహపై విచారణలో నిర్ధారించిన చర్యలు రికవరీలు ఉండవు

* రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కు ఆర్టిఐ ఫిర్యాదు * తక్షణమే రికవరీ తో పాటు చర్యలు చేపట్టండి ప్రజా సంకల్ప వేదిక డిమాండ్

పయనించే సూర్యుడు 2.3.2026 అనకాపల్లి జిల్లా చోడవరం పంచాయతీలో ఇంటి పన్ను ద్వారా వసూలు చేసిన సొమ్ము 16 లక్షల రూపాయలు ట్రెజరీకి చెల్లించకుండా బిల్ కలెక్టర్లు స్వాహా చేసినట్లుగా విచారణలో నిర్ధారించి నివేదిక ఇచ్చినప్పటికీ ఏ విధమైన చర్యలు చేపట్టలేదని, తక్షణమే రికవరీ జరిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని ప్రజా సంకల్ప వేదిక ఆర్టిఐ(ర్ టీ ఐ) రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి, చోడవరం నియోజకవర్గం, ప్రజా సంకల్ప వేదిక ఆర్ టి ఐ ఇన్చార్జి కోవెల చందర్రావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ చోడవరం పంచాయతీలో ఇంటి పనుల సొమ్ము దుర్వినియోగంపై జిల్లా కలెక్టర్కు అందిన ఫిర్యాదు పై విచారణకు ఆదేశించారని విచారణ అధికారిగా నర్సీపట్నం డి ల్ పి ఓ నియమించగా డి ల్ పి ఓ విచారణ జరిగిన విచారణలో కార్యదర్శి బిల్ కలెక్టర్ 11/9/ 2025 హాజరు కాగా బిల్ కలెక్టర్లు ముగ్గురు కలిసి సొంతానికి వాడుకున్నామని వసూలు చేసిన 15.45.657 రూపాయలు రెండు దఫాలు గా పంచాయతీకి జమ చేస్తామని లిఖిల పూర్వకంగా విచారణ అధికారికి విడివిడిగా లేఖలు వ్రాసి ఇచ్చి ఉన్నారు. 15/11/2025, నాటికి పంచాయతీకి జమ చేయ కపోవడంతో ప్రస్తుత పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ డి ల్ పి ఓ బిల్ కలెక్టర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదిక ఇవ్వగా దానిపై విచారణ అధికారి డి ఎల్ పి ఓ.రాక్, NO. 237 /2025/ బి, తేదీ 22/ 10/ 2025న డీపీవో కార్యాలయం అనకాపల్లి వారికి క్రమశిక్షణ చర్యలు చేపట్టవలసిందిగా నివేదిక అందించారు. నేటికీ ఎనిమిది నెలలు గడుస్తున్న ఏ విధమైన చర్యలు చేపట్టుకుపోగా ముగ్గురిని వేరొక మండలానికి బదిలీ చేయడం విశేషం. ఆ మండలంలో ఇంటి పన్నులు విషయంలో అక్రమాలు జరిగినట్లుగా ప్రచారం జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖలో జవాబుదారితనం పారదర్శకత లేదని అవినీతిమయంగా మారిందని వీటన్నిపై తక్షణమే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని సమాచార చట్టం (ర్ టీ ఐ) రాష్ట్ర అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి , అనకాపల్లి జిల్లా ప్రజా సంకల్ప వేదిక ఆర్ టి ఐ ప్రధాన కార్యదర్శి, చోడవరం నియోజవర్గం ఇన్చార్జి కోవెల చందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *