జమ్మికుంట మున్సిపాలిటీలో అర్పీల అవినీతి పై గట్టిగా హెచ్చరికలు… ఇక సహనం లేదు!

★ డోర్ టు డోర్ చెత్త సేకరణలో నిర్లక్ష్యం, లోన్‌ల పేరుతో వసూళ్ల ఆరోపణలు ★ అవినీతిపై నేరుగా ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపు ★ అర్పీల పనితీరుపై మున్సిపల్ అధికారుల కఠిన వైఖరి

పయనించే సూర్యుడు / ఏప్రిల్ 2 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అర్పీలు అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మున్సిపల్ చైర్మెన్ మరియు మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మెన్ అధ్యక్షతన కమిషనర్ మహమ్మద్ అయాజ్ అర్పీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో డోర్ టు డోర్ చెత్త సేకరణ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో అర్పీల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అర్పీలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. సంఘాలకు బ్యాంకుల ద్వారా లోన్లు అందించడం కూడా అర్పీల ముఖ్య బాధ్యతగా ఉందని తెలిపారు. అయితే, ఇటీవలి కాలంలో లోన్‌ల మంజూరు పేరుతో సభ్యుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులు నేరుగా తమకు లేదా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇటువంటి ఆరోపణలు బయటపడటంతో మున్సిపాలిటీలో అర్పీల వ్యవహార శైలి పై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన అర్పీలు స్వప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, మెప్మా ఇంచార్జి టి.ఏం.సి మల్లీశ్వరి, సి.ఎల్. అర్పీలు, అర్పీలు, సమాఖ్య ఓబీలు తదితరులు,