పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 2 జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు జరుగుచున్న వార్షిక బ్రహ్మోత్సవములు మొదటి రోజైన నేడు శ్రీ స్వామివారినీ పెళ్లి కుమారుని చేయుట జరిగినది పెళ్లి కుమారుని అవతారంలో స్వామి వారు భక్తులకి దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో మద్రాస్ సిమెంట్ యాజమాన్యం వారు భక్తులు పాల్గొని ఉన్నారు అనంతరం సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం జరుగునని ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్య నిర్వహణ అధికారి నూతక్కి సాంబశివరావు తెలియజేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సహాయ కార్యదర్శి నూతక్కీ సాంబశివరావు మరియు ఆలయ సిబ్బంది గ్రామ నాయకులు గ్రామ ప్రజలు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు