తెలకపల్లిలో కాంగ్రెస్ సాంస్కృతిక సేన నూతన జిల్లా కమిటీ ఎంపిక.

రాష్ట్ర అధ్యక్షులు.చక్రాల రఘు ఆదేశాల మేరకు జిల్లా సాంస్కృతిక సేన కమిటీ ఏర్పాటు.

పయనించే సూర్యుడు. ఏప్రిల్ 2 నాగర్ కర్నూల్ జిల్లా. తెల్కపల్లి మండలం రిపోర్టర్ :సుల్తాన్. నాగర్ కర్నూల్ జిల్లా, తెలకపల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా సాంస్కృతిక సేన నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో అధ్యక్షుడిగా మద్దెల అర్జున్, గౌరవ అధ్యక్షుడిగా మన్యమోని లింగస్వామి, ఉపాధ్యక్షులుగా కాళ్ళ పరుశరాములు మరియు చిన్నకొత్తపల్లి నరసింహను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బొప్పల్లి సుల్తాన్, కార్యదర్శిగా కె. శ్రావణ్ కుమార్, కోశాధికారిగా టి. రామచందర్ నియమితులయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిగా డి. భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా వి. విజయలక్ష్మి, ప్రచార కార్యదర్శులుగా టి. రామకృష్ణ మరియు కాశిదాస్‌లను ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులుగా వట్టిపల్లి బాలకృష్ణ, సురేష్, సాయిరాం, అశోక్, శ్రీకాంత్, వినోద్, మల్లేష్ పాపగల్, శైలజ, నాగరాజు, జ్యోతి, డప్పు మహేష్‌లను కమిటీలో చేర్చారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, సాంస్కృతిక సేన బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజల మధ్య సాంస్కృతిక కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి సంస్థను మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *