నకిలీ విలేఖరులకు చెక్.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 02.04.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) క్యూఆర్ కోడ్ "ప్రెస్" స్టిక్కర్లను ఆవిష్కరించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ మదనపల్లి, ఏప్రిల్ 01: నకిలీ విలేఖరుల అడ్డుకట్టకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని నిజమైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రత్యేక ‘ప్రెస్’ స్టిక్కర్లను సిద్ధం చేయించి, బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కీలక అంశాలను వెల్లడించారు.. సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో ఈ ప్రెస్ స్టిక్కర్లను రూపొందించిన స్టిక్కర్ పై విలేఖరి అక్రిడిటేషన్ నెంబర్ వాహన నెంబర్ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే సదరు ప్రతినిధి పేరు, సంస్థ, హోదా, చిరునామా మరియు కలెక్టర్ జారీ చేసిన అక్రిడిటేషన్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్టిక్కర్ల ద్వారా నిజమైన విలేఖరులెవరో, నకిలీలెవరో పోలీసులకు మరియు ప్రజలకు సులభంగా అర్థమవుతుంది. మొదటి విడత అక్రిడిటేషన్లు ఉన్న వారికి స్టిక్కర్లు నేడు పంపిణీ చేశాం. రెండో విడతలో అక్రిడిటేషన్లు పొందనున్న మిగిలిన వారికి కూడా అందజేస్తామని స్పష్టం చేశారు. పోలీసులకు అనుమానం వస్తే స్టిక్కర్ స్కాన్ చేసి వివరాలు సరిచూసుకుంటారు. ఎవరైనా నకిలీ క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నట్లు తేలితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఇటువంటి స్టిక్కర్లను ఎవరైనా సొంతంగా ముద్రించినా లేదా విక్రయించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. తమ సమస్యను గుర్తించి, త్వరితగతిన స్పందించి ఈ వినూత్న వ్యవస్థను తీసుకువచ్చినందుకు జిల్లా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఎస్పీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల వృత్తిపరమైన విలువలు పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ యం. వెంకటాద్రి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లాపోలీస్ యంత్రాగం