
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 02 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రాజకీయాల్లో పదవుల కంటే విలువలు, విశ్వసనీయతే అత్యంత విలువైన ఆస్తులని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో సర్పంచ్ నల్ల పద్మచంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ‘పంచాయతీ పాలకవర్గ పదవీ విరమణ మహోత్సవానికి’ ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు మారినప్పటికీ, అనేక ఒత్తిడులు, ప్రలోభాలు ఎదురైనా ప్రజాప్రతినిధులు ధైర్యంగా పార్టీ వెంటే నడవడం అభినందనీయమన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలబడ టమే నిజమైన రాజకీయ పరిపక్వత అని ఆయన పేర్కొన్నారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి మరియు పారిశుధ్య కార్మికులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ రెడ్డి దంపతులు నల్లమిల్లి గ్రామ ప్రజాప్రతినిధులను వేదికపై ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.