నేటి నుంచి అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లకు

నిరసన తెలుపుతున్న ఏఐటీయూసీ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్న నాలుగు లేబర్ కోడ్లను నిరసిస్తూ ఈరోజు ఆదోని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది! ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్ కృష్ణయ్య మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21వ తేదీ నుండి నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ ప్రకటించడం జరిగిందని, బ్రిటిష్ నాటి కాలంలో పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను తుంగలో తోక్కిందని వారు అన్నారు.వేతనాలకోడు, పారిశ్రామిక సంబంధాల కోడు, సామాజిక భద్రత కోడు,,వృత్తి భద్రత, ఈ నాలుగు లేబర్ కోడ్ లుగా కార్మికులకు పరివర్తనాత్మక మార్పును తెలియజేస్తాయని కార్మికులకు మెరుగైన వేతనాలు పని భద్రత సామాజిక భద్రత సంక్షేమం కార్మిక భవిష్యత్తుకు రక్షిత సంకేతాలని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రంలో కూటమి నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని ఇది భారతదేశ కార్మిక వర్గ కార్మికుల శ్రేయస్సును పక్కాగా కార్పొరేట్ పెట్టుబడి దారులకు దాషోహం చేస్తున్న అనుకూలమైన విధానాలని, కార్మికుల శ్రమను దోచుకునేందుకే ప్రవేశపెట్టారన్నారు. ఇవి దోపిడీ చట్టాలని అన్ని కార్మిక సంఘాలు ఒకవైపు వ్యతిరేకిస్తున్నా వీరికి కనపడడం లేదన్నారు. పాలకులకు ఆలోచన అంతా కార్పొరేట్లకు ఎలా మేలు చేయాలనే ఆలోచన తప్ప కార్మిక వర్గానికి న్యాయం చేసే పరిస్థితి లేదన్నారు.. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సిగ్గుచేటు అయిన విషయం అన్నారు.ఇలాంటి చర్యలు లేబర్ కోడ్స్ లో భాగమేనని వారన్నారు.. స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అమలోకి తెచ్చిన లేబర్ కోడ్స్ ను వ్యతిరేకిస్తూ కార్మిక రైతు ప్రజా సంఘాలు కదంతో తొక్కాలన్నారు.. సమ్మె చేసే హక్కుతో పాటు ఈఎస్ఐ-పిఎఫ్ రక్షణ చట్టాలు,పనికి తగిన వేతనం అడిగే అవకాశం కూడా వీటి ద్వారా కార్మికుల కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక హక్కుల రక్షణకై భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ తెలియజేస్తామన్నారు.. ఈ సమావేశానికి ఏఐటీయూ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఓబి నాగరాజ్ వైటి భీమేష్ అజయ్ బాబు సిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు సుదర్శన్ మరియు ఉపాధ్యక్షులు గిరి మల్లప్ప ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు కల్లుబావిరాజు వడ్డే రాముడు లక్ష్మీనారాయణ దేవా నాగరాజు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *