నేరేడుచర్ల నియోజకవర్గం సాధించేంతవరకు మడమతిప్పని పోరాటం చేద్దాం ..

ప్రతిన బూనిన సకల జనులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 02 నేరెడుచెర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్ ) కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన లో నేరేడుచర్లను నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అందుకొరకు నేడేడుచర్ల విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో జరిగిన సకల జనుల సమావేశంలో వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ నేరేడుచర్ల నియోజకవర్గం అయేంతవరకు మడమ తిప్పని పోరాటం చేద్దామని అందుకు నేరేడుచర్ల గరిడేపల్లి పాలకవీడు పెన్ పహాడ్ లోని అన్ని గ్రామాల్లోని యువకులను సమీకరించి ఉద్యమ బాట పట్టించాలని నిర్ణయించారు. నేరేడుచర్లలు నియోజకవర్గంగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నేషనల్ హైవే మీద ఉండటం మూసి నది మరియు కష్టా నది పరివాహక ప్రాంతం కావడం జాన్ పహాడ్ లాంటి చారిత్రక దర్గా ఇక్కడే ఉండడం విద్యాసంస్థలు అలాగే త్వరలో రైలు సౌకర్యం ఏర్పడే అవకాశం ఉన్నదని ఇప్పటికే జాన్ పహాడ్ కు గూడ్స్ రైలు సౌకర్యం ఉన్నదని, నియోజకవర్గంగా ఏర్పడితే మహంకాళి గూడెంపై హై లెవెల్ బ్రిడ్జి పొందవచ్చని, పోలీస్ సర్కిల్ కార్యాలయం ఏర్పడుతుందని అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఐటిఐ కాలేజీలు, లాంటివి నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉన్నదని నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా రావడం ద్వారా అన్ని గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడం కాకపోతే మరో 30 సంవత్సరాల వరకు అయ్యే అవకాశం ఉండదని అందువల్ల ఈ ప్రాంత ప్రజలు పాలకులను ఒప్పించి అధికారులను ఒప్పించి నియోజకవర్గ సాధించేందుకు కృషి చేయాలని అందుకు స్థానిక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అండదండలు కావాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించి గౌరవించి అవకాశo కల్పించాలని వారి కోరారు సమావేశానికి సామాజిక కార్యకర్త ధూళిపాళ ధనుంజయ నాయుడు అధ్యక్షత వహించగా…. మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, సరికొప్పుల నాగేశ్వరరావు ఎస్.కె ఖలీల్ రాపోలు నవీన్ ఆకారపు వెంకటేశ్వర్లు, కొదమగుండ్ల నగేష్, బాల వెంకటేశ్వర్లు, నరి నాయక్, బొడ్డుపల్లి సుందరయ్య, వాస పల్లయ్య, ఎస్.కె ఇబ్రహీం, పెరుమాళ్ళ సతీష్, ఇంజమూరి వెంకటయ్య, జింకల భాస్కర్, రాజేష్ రెడ్డి కొనతం నాగిరెడ్డి, ఎడవల్లి అరుణ్ కుమార్, కత్తి శ్రీనివాసరెడ్డి, రావుల సత్యం, ముళ్ల జానయ్య, తక్కెళ్ళ నాగార్జున, కొమర్రాజు వెంకట్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఏ లక్ష్మి. నక్క రమాదేవి, అంబటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *