పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ ఏప్రిల్.02.2026 అడ్డతీగల మండలం జల్లూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు పిల్లలకు పెట్టవలసిన మధ్యాహ్న భోజనాలకు బదులుగా గ్రామంలో జరిగిన దినకార్యంలోని భోజనాలను పాఠశాలకి పట్టుకొని వచ్చి పిల్లలకు పెట్టారని పిల్లల బంధువులు తమ దృష్టికి తీసుకుని వచ్చారని.”ఆదివాసి సంక్షేమ పరిషత్”(274/16)ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు అన్నారు.ఈ పాఠశాల నందు ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తూ ఉన్నారని,అందులో ఒక ఉపాద్యాయుడు ఆ దినకార్యంలో వారితో కలసి పాఠశాల పని వేళలలో కల్లు(మత్తుపనీయం)సేవించారని కూడా పిల్లల బంధువు తెలిపారని అన్నారు.అయితే దినకార్యంలోని భోజనాలు పాఠశాల పిల్లలకు వడ్డించటం,పాఠశాల సమయంలో ఉపాద్యాయుడు కల్లు సేవించటంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అడ్డతీగల మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారికి ఈ ప్రకటన ద్వారా తెలుపుతున్నమ్మన్నారు.చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్ వారికి పిర్యాదు చేస్తామని అన్నారు..