పాదయాత్ర చేస్తున్న హనుమాన్ దీక్ష పరులకు ఐదురోజులుగా వాటర్ పండ్లు మజ్జిగ పంపిణి చేసిన

★ గొల్లపెల్లి మండల స్థానిక వ్యాపారాస్తుడు కాలువ శ్రీనివాస్ యాదవ్

పయనించే సూర్యుడు2-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రం లో గల ఎన్ వి ఆర్ ఫంక్షన్ హల్ దగ్గర పరిసర ప్రాంతాల నుండి కొండగట్టు లో జరగబోయే చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల కు పాదయాత్ర గా వెళ్లే హనుమాన్ దీక్ష పరులకు మజ్జిగ. వాటర్ బాటిల్స్. పళ్ళు 5రోజులుగా ఇవ్వడం జరుగుతుంది స్థానిక వ్యాపారస్తుడు యువ నాయకులు కాలువ శ్రీనివాస్ యాదవ్ .వారు మాట్లాడుతూ హనుమాన్ దీక్ష స్వాములు కొన్ని 100 లా కిలోమీటర్ నుండి పాదయాత్ర గా వస్తున్నారు వారికీ అల్పాహారం గా నావంతు సహాయం గా 5రోజుల నుండి వారికీ పండ్లు వాటర్ బాటిల్ మజ్జిగ పంపిణి చేస్తున్నాను ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమం లు చేస్తాను అన్నారు శ్రీనివాస్. ఈ కార్యక్రమం లో వారి తో పాటు ప్రవీణ్, శ్రీపాల్ రెడ్డి,ప్రశాంత్ అజేయ్,సందీప్,నిరాజ్, సురేష్,రవి,వినేష్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు