పయనించే సూర్యుడు ఏప్రిల్ 02 ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:ఉట్నూర్ మండలం దంతన్ పల్లి లోని దొంగ చింత గ్రామంలో పాము కాటుకు గురై ఎద్దు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది గ్రామానికి చెందిన రైతు వెడ్మ ఆనంద్ తన వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ సంఘటన జరిగింది పొలంలో దున్నే పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పాము ఎద్దును కాటేసినట్లు సమాచారం కాటు అనంతరం ఎద్దు తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయి మృతి చెందింది ఈ ఘటనతో రైతుకు ఆర్థిక నష్టం వాటిల్లింది గ్రామ పరిసరాల్లో పాముల సంచారం పెరిగిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.