పారమౌంట్ ఇండస్ట్రీకి విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగళ్ల సురేష్ ని

కేడీసీసీ బ్యాంకు చైర్మన్, మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా పరామర్శించారు.

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 2 పెనుగంచిప్రోలు మండలం కొనకంచి గ్రామంలో బ్యాటరీ వద్ద ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన అనంతరం పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి తన కార్యాచరణలో భాగమవుతూ పారమౌంట్ ఇండస్ట్రీకి విచ్చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగళ్ల సురేష్ ని కేడీసీసీ బ్యాంకు చైర్మన్, మాజీ మంత్రివర్యులు నెట్టెం శ్రీ రఘురాం మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన సురేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని మళ్లీ వ్యాపార కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగంలో వెనిగళ్ల సురేష్ సేవలు, ప్రాంతీయ జగ్గయ్యపేట ప్రాంత అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం అని కొనియాడారు. ఇకపై మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పరిశ్రమ అభివృద్ధికి తన వంతు పాత్ర కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *