
పయనించే సూర్యుడు న్యూస్: ఏప్రిల్/02 :నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం పేదల కోసమే పని చేస్తున్నదని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్ లో తిమ్మాపూర్ మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ పథకాల ద్వారా లక్షా నూటపదహారు రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. అర్హులైన కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. పేద ఆడ పడచులు పెళ్లిళ్లకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని ఆయన వివరించారు. ఈ పథకాలు పేదలకు ఎంతోలాభదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల తాహసిల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బండారి రమేష్, మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీగిరి రంగారావు,కుంట రాజేందర్ రెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, పొన్నాల సంపత్, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, పాలు రాము,రమేష్,నరేందర్ రెడ్డి,చింతల తిరుపతి రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రవీందర్ లక్ష్మారెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఎం జ్యోతి,ఆర్.రమేష్ జీపీఓ రేవంత్ తదితరులు పాల్గొన్నారు.