పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): మండల పరిధిలోని హుగ్గేల్లి గ్రామ సర్పంచ్ పట్లోళ్ళ విమల శ్రీనివాస్ రెడ్డి సామాజిక బాధ్యతతో మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని చెప్పిన విధంగా ఆయన నడుచుకుంటున్నారు. బుధవారం గ్రామానికి చెందిన శ్రీమతి పుట్టి సిద్దమ్మ, కీర్తిశేషులు కిష్టన్న దంపతుల కుమార్తె తులసి వివాహ వేడుకకు సర్పంచ్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి పెళ్లి కానుకగా ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. పుట్టిన ఊరి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతు సహాయం అందించడం ఎంతో తృప్తిని ఇస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలందరి సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజు, ప్రముఖ నాయకులు మునిందర్ రెడ్డి, రాములు, వెంకట్ రెడ్డి, పాండురంగా రెడ్డి, నరేష్, సిద్దారెడ్డి, నిఖిల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.