పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తే సహించేది లేదు,

* నాలుగు లేబర్ కోడ్ ల ను ఉపసంహరించుకోవాలి, * నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 2 మధిర నియోజకవర్గ ప్రతి నిధి ఖమ్మం జిల్లా,ఎర్రుపాలెం : కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తే సహించేది లేదని సిఐటియు జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని దేశవ్యాప్త ఏప్రిల్ ఒకటిన నిర్వహించిన బ్లాక్ డే కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా కార్యకర్తలు మధ్యహాన భోజన కార్మికులు వివిధ రంగాలకు సంబంధించిన పలువురు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రభాకరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులను ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలు పరచాలని సిద్ధం చేసిందని దానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులను తమ ప్రభుత్వం అమలు జరపపోదని అసెంబ్లీలో తీర్మానం చేసిందని అన్నారు. ఆ రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలుపరచాలా, వద్దా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్ లను అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో కార్మిక వర్గాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కో ఆర్గనైజేషన్ దూదిగం బసవయ్య,బేతి శ్రీనివాసరావు,గంతాల నాగేశ్వరావు, నండ్రు సుధారాణి, హైమావతి, విజయలక్ష్మి, దూదిగం శ్రీను, రామకృష్ణ, నక్క పుల్లారావు, చిన్నా, నగేష్, ఈశ్వరమ్మ, మల్లేశ్వరి, వివిధ సంఘాలకు సంబంధించిన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *