
పయనించే సూర్యుడు, ఏప్రిల్ 02 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ శేరిలింగంపల్లి డివిజన్… రాజీవ్ గృహకల్పలో శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి దివ్య ఆశీస్సుల తో మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సొంత ఖర్చు లతో నూతనంగా నిర్మాణం చేపట్టిన శ్రీ షిర్డీ సాయినాథ,మార్ఖండేయ స్వామి సంతా న నాగదేవత అమ్మవారి ఆలయంలో విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం జరిగి 41 రోజులు పూర్తయిన సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించిన మండల పూజా,లక్ష్మీ గణపతి నవగ్రహ స్థాపిత దేవత మూల మంత్ర హోమాలు, ప్రధాన కలశ స్థాపన పూజ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు రాగం అని రుధ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాగం అనిరుధ్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ తమ కుటుంబా లతో సుఖశాంతులతో.. జీవించాలని
ఈ సందర్భంగా ఆ దేవదేవులను ప్రార్థిస్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు,యువ నాయకులు,మహి ళా నాయకురాళ్లు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.