
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజా ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా 99 రోజులపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మెరుగైన ప్రత్యేక వైద్యులచే పరీక్షలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు బిజినపల్లిలో నిర్వహించిన వైద్య ఆరోగ్య శిబిరం విజయవంతమైంది. బిజినపల్లి గ్రామ సర్పంచ్ మిద్దె ఇందిర,రాములు శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రత్యేక వైద్యుల సేవలు అందడం, ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యం మెరుగు అవుతుందని అన్నారు. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే.రవికుమార్ నాయక్, జిల్లా క్షయ వ్యాధి నిర్మూలన ప్రోగ్రాం అధికారి డాక్టర్ రఫీక్ ప్రత్యేకంగా పరిశీలించారు. జిల్లాలో జరిగే ప్రతి ఆరోగ్య శిబిరాలను ప్రజలు వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. గుర్తించిన రోగులను ప్రత్యేక చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం లో సర్జరీ అందిస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మెరుగ్గా సేవలు అందించాలని సూచించారు. శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ నిఖిత గర్భిణీలకు, ఇతర మహిళలకు 44మందికి ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు.డాక్టర్ ఉదయ్ కుమార్ 46మంది ఆర్థోపెడిక్ సేవలు అందించారు. డాక్టర్ పి.పూర్ణిమ 88మంది సాధారణ రోగులకు ప్రత్యేక పరీక్షలు చేశారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజు నాయక్ నవజాత శిశువులను చిన్నారులను ప్రత్యేకంగా పరీక్షించి ఆరోగ్య సూచనలు తల్లిదండ్రులకు చేశారు. శిబిరంలో దంత వైద్య సేవలు డాక్టర్ సత్య లక్ష్మి అందజేశారు. కంటి వైద్య సేవలు డాక్టర్ సుష్మ అందించారు. రోగులకు తెలంగాణ డయాగ్నస్టిక్ ల్యాబ్ ద్వారా సేకరించిన రక్తమును జిల్లా కేంద్రానికి పంపారు. శిబిరంలో పరిక్షించుకున్న రోగులకు ప్రత్యేక వైద్యులు సూచించిన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి. సృజన, డాక్టర్ నరేశ్, డాక్టర్ రవళి, డాక్టర్ రమ్య,పర్యవేక్షకులు అశోక్ కుమార్, తామర, కే.గంగా, సుజాత, మహిళా ఆరోగ్య కార్యకర్తలు కే.మంగ, శ్వేత,సిబ్బంది రషీద్, ఆంజనేయులు, మజీద్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.