పయనుంచే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 1 మండల ప్రతినిధి బొద్దుల భూమేష్ మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్ లో ఈనెల ఏడో తేదీన తలపెట్టిన 24 గంటల నిరవధిక దీక్ష గోడ ప్రతులను జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విడుదల చేస్తూ నాయకులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీల ఏ ఒక్క డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదు ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రెండు ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లాలో ఉన్న బీసీ కులాలు బీసీ వాదులు ఈ యొక్క దీక్షకు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకటయ్య, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ,వేముల అశోక్,మంచెర్ల సదానందం,చెలిమెల అంజయ్య,రామగిరి రాజన్న చారి తదితరులు పాల్గొన్నారు.