భారత్ గ్యాస్ సక్రమంగా పంపిణీ చేయండి

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 2 యాడికి మండల తహశీల్దారు కి మా సామాజిక ఉద్యమ నమస్కారములు గత 20 రోజులుగా వంట గ్యాస్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడో వేరే దేశంలో యుద్ధం జరుగుతుంటే దోపిడీ ఇక్కడ చేసుకుంటున్నారు. గతంలో గ్యాస్ బుక్ చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఇంటికి వచ్చేది ఇప్పుడు వారం పది రోజులైనా రావడం లేదు. కానీ వచ్చిన గ్యాస్ సజావుగా అందరికీ అందిస్తే కొంత ఊరట వస్తుంది. వచ్చిన గ్యాస్ ను బయట హోటల్ వాళ్లకి రెండు నుంచి మూడు వేలకు అమ్ముకుంటున్నారు. మరికొన్ని ఫోన్లు ద్వారా బయటికి పంపిస్తున్నారు. ఇలా కాకుండా పోలీస్ వారు దగ్గరుండి వరుస పద్ధతిలో అందరికీ గ్యాసు దక్కే చూడాలని కోరుతున్నాము. భారత్ గ్యాస్ గుత్తి నుంచి వస్తుంది డెలివరీ చార్జీలు సిలిండర్ కి 30 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఇంటి దగ్గరికి పోకుండా ఒకే చోట ఉండి పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల అదనపు భారం పడుతుంది. భారత్ గ్యాస్ ఇంటి దగ్గరికి పోయేలా చూడాలని కోరుతున్నాము. . పై సమస్యలను పరిగణలోకి తీసుకొని తక్షణమే పరిష్కరించాలని తమరి ద్వారా కలెక్టర్ ని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాతకుంట్ల బాలు మండల అధికార ప్రతినిధి చిటికల చిరంజీవి మస్తాన్ తిరుపాల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు